ముచ్చింత‌ల్‌లో రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది వేడుక‌లు షురూ

02-02-2022 Wed 11:12 | Both States
  • సమతా మూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవాలకు అంకురార్పణ  
  • యాగశాల వద్ద శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు
  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన క్షేత్ర ప్రాంగ‌ణం
  • ఈ నెల‌ 14వ తేదీ వరకు ఉత్సవాలు
రామానుజాచార్యుల‌ సహస్రాబ్ది వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌ క్షేత్రంలో రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. యాగశాల వద్ద శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు జ‌రుపుతున్నారు.  

ఆ క్షేత్ర ప్రాంతం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల‌ 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ క్రతువు జ‌రుగుతోంది. లక్ష్మీనారాయణ మహా యజ్ఞం, 108 దివ్యదేశాల ప్రతిష్ఠ, కుంభాభిషేకం, సమతామూర్తి లోకార్పణ కార్య‌క్ర‌మాల‌తో పాటు నాలుగు వేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, పది కోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపం, ప‌లు పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథాల పారాయణం చేస్తారు.

యాగశాలల వద్ద 1,035 కుండాలకు అవసరమైన యాగసామగ్రిని మహిళలు సిద్ధం చేశారు. హోమాల్లో ఐదు వేల మంది రుత్వికులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలకు ఈనెల 5వ తేదీన‌ ప్రధాని మోదీ, 13వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్న విష‌యం తెలిసిందే. దీంతో క్షేత్ర ప్రాంగణంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.
ramanujachinajeeyar swamiHyderabadRanga Reddy District

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more